Wednesday, November 14, 2012

మాదాకవళం తల్లీ అంటే... మా ఆయనెక్కడైనా కనిపించాడా అన్నదట!



ఓ బిచ్చగాడు ఓ ఇంటిముందు నిలబడి, ‘మాదాకవళం తల్లీ’ అన్నాడట. ఆ ఇల్లాలు బయటికొచ్చి ‘మా ఆయనెక్కడైనా కనబడ్డాడా’ అందట. వెంటనే ఆ బిచ్చగాడు ‘ఎక్కడైనా కనిపిస్తే పంపిస్తాలే తల్లీ’ అంటూ వెళ్లిపోయాడట. ఇంతకీ విషయమేమిటంటే... ఆ ఇల్లాలి భర్త కూడా బిచ్చగాడే. అతడు బిచ్చం తెస్తేగానీ ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. ఆ విషయాన్ని నోటితో చెప్పడానికి మొహమాటపడి, గుట్టు విప్పీ విప్పనట్టుగా మాట్లాడిందన్నమాట. అది అర్థమై బిచ్చగాడు వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఎవరైనా అసలు విషయాన్ని దాచడానికి ఎదురు ప్రశ్నలు వేసినప్పుడు ఈ సామెత వాడుతుంటారు.

No comments:

Post a Comment