Tuesday, November 13, 2012

అర్జునా... ఫల్గుణా’ అని ఎందుకంటారు?



పిడుగులు పడినప్పుడు ‘అర్జునా... ఫల్గుణా’ అని ఎందుకంటారు? దీని వెనుక మహాభారత గాథ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకొస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోటానికి ఆయుధాలను చెట్టుమీదనుంచి దించమంటాడు. ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న పది పేర్లు (అర్జునా, ఫల్గుణా, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ (పాండవులు పెట్టిన పేరు), సవ్యసాచి, ధునంజయ) చెప్పి, భయాన్ని పోగొడతాడు.

అప్పట్నుంచీ ఎలాంటి భయం కలిగినా ‘అర్జునా ఫల్గుణా’ అని తలచుకోవడం మొదలయ్యింది. అయితే యుద్ధంలో అర్జునుడి రథ చక్ర శూల విరిగిపడిందని, అదే పిడుగయ్యిందని నమ్మకం ఉండటంతో, పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు

No comments:

Post a Comment