Monday, November 12, 2012

రెడ్డొచ్చె మొదలాడు...



ఎవరైనా ఏ విషయాన్నయినా మళ్లీ మొదట్నుంచి చెప్పమన్నా, చేయమన్నా ‘రెడ్డొచ్చె మొదలు’ అంటూ ఉంటారు. దీనికి ఓ సంఘటన కారణం. 

అప్పట్లో వీధుల్లో నాట్య ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. వీటిని జనం ఆనందంగా తిలకించేవారు. ఓసారి ఓ నాట్యగత్తె వీధిలో నాట్యం చేస్తూ ఉందట. కాసేపటికి ఆ ఊరి రెడ్డిగారు వచ్చి... తాను ఆటని మొదట్నుంచీ చూడలేదు కాబట్టి, తిరిగి మొదలు పెట్టమన్నాడట. ఆమె మళ్లీ మొదటి నుంచి ప్రారంభించిందట. కాసేపటికి మరో రెడ్డి వచ్చి, తాను మొదట్నుంచీ చూడాలి అన్నాడట. ఆమె మళ్లీ మొదట్నుంచి చేయడం మొదలుపెట్టిందట. ఇంకాసేపటికి ఇంకో రెడ్డి వచ్చి కూడా అలాగే చేశాడట. ఇలా ఎవరో ఒక రెడ్డి వచ్చి ఇలాగే చేయడంతో తెల్లారేవరకూ ఆట ముగియనే లేదట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోనికి వచ్చింది. 



                                                                 సామెతలు 

No comments:

Post a Comment