నాకు అప్పుడప్పుడు ఇలా జరిగితే బలే తమాషాగా వుంటుంది కదా అనిపిస్తుంది. అది ఏంటంటే ఒకవేళ ఎవరినా దేవుడు దిగివచ్చి నాకు అదృశ్యం అయ్యే వరం ఇస్తే బాగుటుంది కదా అని. కాని ఈ వరం ఒక్కరోజు మాత్రమే వుండాలి. ఎందుకంటే ఎప్పటికి వుంటే మరలా దాని విలువ మనకి తెలిదు కదా అందుకు. నాకే గనక ఈ వరం వుంటే నేను అ వరమును ఇలా ఉపయొగించుకుంటాను.
1. నాకు ఎవరిమీదయిన కోపం వుంటే వెళ్లి వాళ్ళని నాలుగు దెబ్బలు వేసి వస్తాను.
2.ఒకవేళ అ రోజు పవన్ కళ్యాన్ సినిమా గనక రిలీజ్ అయివుంటే హాయిగా అ సినిమా చుస్తాను. అది కూడా టికెట్ లేకుండా.
3. సినిమా షూటింగ్ జరుగుతుంటే చుడాలి అని నాకు చిన్నప్పటినుండి బాగా ఇష్టం . అందుకే అది కూడా చుసెస్తాను.
4.బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి దొంగతనం చేసి అ డబ్బును పేదవాళ్ళకు పంచుతాను. మన తెలుగు సినిమాల్లో హీరో లాగ.
మరి మీకు కూడా ఇలాంటి వరం వస్తే దానిని ఎలా ఉపయొగించుకుంటారొ చెప్పండి.
No comments:
Post a Comment