ఒడిశాలోని పూరీజగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల మూలమూర్తులకు ప్రతి యేటా ఆషాఢశుద్ధ విదియనాడు అంగరంగవైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. ఆ సమయంలో అన్ని జాతులు, కులాలు సమానమే అనే విషయాన్ని క్రియారూపంగా చూపేలాగా 64 రకాల పిండివంటలను వండి, వాటిని ప్రసాదంగా నివేదించి మహాప్రసాదం పేరిట ఒకే పళ్లెరంలో అందరు భక్తులకు జాతి, కుల ప్రస్తావన లేకుండా ఒకే పంక్తిలో కూర్చోబెట్టి పంచుతారు.
నిత్యాగ్నిహోత్రులు, దీక్షధారులు మొదలు బికారులు, సన్యాసులు, సంసారులు, సర్వజాతులు, కులాలవారందరూ కలసి ఆ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. ఇలా అందరూ ఒక చోట చేరి ప్రసాదాన్ని స్వీకరించడాన్నే ‘సర్వం జగన్నాథం’ అనే పేరుతో సామెతగా స్థిరపడిపోయింది.
No comments:
Post a Comment