Tuesday, November 13, 2012

ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?



ఇంటి ఆడపడచు సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానం. ఇంటి ఆడపిల్ల సంతోషంగా ఉండటం పుట్టింటికి శుభప్రదమైతే, పుట్టింటి నుంచి లభించే చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఒడిబియ్యం వంటి మంగళప్రదమైన ద్రవ్యాలు ఆడపడచుకు సౌభాగ్యప్రదం.

అన్నింటికీ మించి పుట్టింటివారు ఆడపిల్లకు పెళ్లి చేసి, అత్తవారింటికి పంపి చేతులు దులిపేసుకోకుండా అప్పుడప్పుడూ ఆమెను తీసుకొచ్చి ఒడిబియ్యం వేడుక చేయడం ద్వారా రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయనే ఉద్దేశంతోనే ఈ ఆచారం ఏర్పడి ఉంటుందని పెద్దలు చెబుతారు.

No comments:

Post a Comment