Monday, November 12, 2012

వివాహిత స్త్రీలు మట్టెలు ఎందుకు పెట్టుకుంటారు?




కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగాథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది.

No comments:

Post a Comment