శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే ప్రతి యేటా ఇదే రోజున పావన గౌతమీ నదీ తీరంలోని భద్రాచల క్షేత్రంలో భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరివేసి, ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండువుగా, అంగరంగ వైభవ ంగా శ్రీ సీతారామకళ్యాణం ఎందుకు జరిపిస్తారు?
దీనికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఇలా చెబుతోంది. పరమాత్ముడు అవతార మూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాలి. ఒక వేళ ఆ తిథి ఏదో ఇదమిత్థంగా తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించాలి. అందుకే ఒక్క శ్రీరామునికే కాదు, అందరు దేవతలకూ పుట్టిన రోజునే కల్యాణోత్సవం జరిపించడం పరిపాటి.
No comments:
Post a Comment