రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేదట. ప్రజలు దాచుకున్నదాన్నంతిటినీ కొల్లగొట్టడమేగాక వారిని దొంగలు నానా హింసలూ పెట్టేవారట. దాంతో వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను బంధించి, వారందరినీ వరుసగా నిలబెట్టి తలలు నరికేయమని ఆజ్ఞాపించాడు. ఇక ఎలాగూ చావు తప్పదని అర్థం చేసుకున్న దొంగల్లో భయం మొదలైంది.
కొంతమందిని నరికాక అయినా రాజుకు జాలి వేయకపోతుందా, తనను వదిలేయకపోతాడా అన్న ఉద్దేశంతో ఒక దొంగ భటుడితో ‘అటునుండి నరుక్కు రా’ అంటే, ఆ చివరన ఉన్న దొంగ ‘లేదు లేదు, అటునుంచి నరుక్కురా’ అన్నాడట. అప్పట్నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది
No comments:
Post a Comment