Saturday, January 5, 2013

సూర్య గ్రహణం అంటే ఏమిటి ?


భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.


భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని చూస్తారు. 1999 లో ఐరోపా లో కనిపించిన సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు. దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. తరువాతి గ్రహణాలు 2005, 2006లలోను, 2007 సెప్టెంబర్ 11 న వచ్చాయి. తరువాతి సంపూర్ణ సూర్యగ్రహణము 2008 ఆగష్టు 1 న వచ్చింది .

సూర్య గ్రహణాలు నాలుగు రకాలు.
·           సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగ కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలొ సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములొ వారికి మాత్రమే కనిపిస్తుంది.
·           అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.
·            సంకర గ్రహణం: ఇది సంపూర్ణ మరియు అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.
·             పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడూ ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.
        సూర్య గ్రహణం నాటి సూర్య, చంద్ర, భూ స్థితులు ఎలా ఉంటాయో పైన ఉన్న బొమ్మలో చూడవచ్చు. ముదురు బూడిద రంగుతో ఉన్న భాగాన్ని పూర్ణ ఛాయ (అంబ్రా) అని పిలుస్తారు. లేత బూడిద రంగులో ఉన్న భాగాన్నిఉప ఛాయ (పెనంబ్రా) అని పిలుస్తారు. ముదురు బూడిద రంగు భాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. లేత బూడిద రంగు ప్రాంతంలో పాక్షిక సూర్యగ్రహణము కనిపిస్తుంది. భూని చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వలన అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడికి పైనో క్రిందో ఉంటాడు. అమావాస్య నాడు, చంద్రుడు చంద్ర కక్ష్య, భూకక్ష్య ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే సూర్య గ్రహణము ఏర్పడుతుంది.


Friday, January 4, 2013

సూపర్ ఎర్త్ గురించి తెలుసుకుందామా....ఈ అనంత విశ్వంలో వేరెక్కడైనా జీవరాశి ఉందేమోనని తెలుసుకునేందుకు సైన్సు పరిశోధనా చరిత్రలోకెల్లా అతి విస్తృతానే్వషణ కార్యక్రమం జరుగుతోంది. అత్యాధునిక కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని నాసా’ (అమెరికా వ్యోమ, వైమానిక సంస్థ) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.
1960లో రష్యాలో ఎద్దు పుర్రె ఒకటి దొరికింది. దానిని ప్రయోగశాలలో విశే్లషించి చూస్తే ఆ ఎద్దు బతికి ఉండగా నాలుగు వేల సంవత్సరాల క్రితం కొట్టిన తుపాకీ గుండు వల్ల పుర్రెకు రంధ్రం పడినట్లు తెలుసుకున్నారు. అన్ని వేల సంవత్సరాల క్రితం తుపాకీ గుండు ఎక్కడిది?
అమెరికాలోని నవాడా రాష్ట్రంలో దొరికిన ఒక ఇనుప నట్టు కూడా అనేక మిలియన్ల సంవత్సరాలకు పూర్వం తయారు కాబడిందని కనుగొన్నారు. ఒకప్పుడు భూమి మీద గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పడానికి కావలసినన్ని తార్కాణాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ భూమిపై మానవుడు అవతరించడానికి ముందు అన్యగ్రహ వాసులు ఈ భూగ్రహానికి యాత్రలు చేస్తూ ఉండేవారని కొంతమంది బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ఈ గ్రహాంతర వాసుల ఉనికిని తెలియజేసే సంకేతాల కోసం మన శాస్తవ్రేత్తలు అహరహం శ్రమిస్తున్నారు.
గ్రహాంతర బుద్ధిజీవుల గురించి నేడు దేశదేశాలా తర్క వితర్కాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇంతవరకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల మీద గాని, వాటి ఉపగ్రహాల మీద గాని జీవరాశి జాడ వున్న ఆధారాలు ఏమీ లభించలేదు.సూపర్ ఎర్త్
అంతరిక్షంలోని రహస్యాలను తొంగి చూసేందుకు అనేక అంతరిక్ష నౌకలతోపాటు, అంతరిక్ష టెలిస్కోప్‌లు అంతరిక్షంలో నిరంతరం అనే్వషణా కార్యక్రమంలో ఉన్నాయి.
సుదూర ప్రాంతాల్లో ఇతర నక్షత్రాల సమీపంలో జీవరాశి ఉండే అవకాశం గల గ్రహాల అనే్వషణా కార్యక్రమంలో భూమిని పోలిన సూపర్ ఎర్త్‌ను గుర్తించడం జరిగింది.
600 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న సూపర్ ఎర్త్‌ను నాసా తమ కెఫ్లర్ అంతరిక్ష దూరదర్శిని ద్వారా గుర్తించింది. ఇది ఆ నక్షత్రం చుట్టూ మన కాలమానం ప్రకారం 290 రోజులకు ఒకసారి తిరుగుతోంది. ఇది భూమి పరిమాణానికి 2.4 రెట్లు ఉంది. అందుకే దీనిని సూపర్ ఎర్త్అనే పేరుతో గుర్తిస్తున్న వాటి జాబితాలో చేర్చారు.
ఈ సూపర్ ఎర్త్ తలం జీవరాశికి నివాసయోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, దానికి ఉపరితలం ఉంటే జీవరాశి మనుగడకు కావలసిన ఉష్ణోగ్రత ఉంటుందని నాసా శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ గ్రహం ఉపరితలంపై నీరు ద్రవరూపంలో ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే దీని తలం ఘనరూపంలో ఉందా లేదా నెప్ట్యూన్ తలం మాదిరి వాయు రూపంలో ఉందా? అనే విషయంపై అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు నాసా శాస్తవ్రేత్తలు.
ఈ సూపర్ ఎర్త్‌ను కెప్లర్ 22-బి అని నామకరణం చేశారు. దీని ఉపరితలం మీద ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చునని భావిస్తున్నారు. సౌర కుటుంబం వెలుపల ఇంతవరకు గుర్తించిన గ్రహాల్లో ఇదే అనువైన వాతావరణం కల్గి ఉందని నాసా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
తమ అధ్యయనంలో ఈ సూపర్ ఎర్త్‌పై కొంత నేల మరి కొంత నీరు ఉందని తెలిసిందంటున్నారు. సాధారణంగా ఒక గ్రహంపై జీవరాశి ఉండాలంటే అది దాని మాతృతారకు నిర్దేశిత దూరంలో ఉండాలి. అప్పుడే దాని మీద ఉష్ణోగ్రత జీవరాశి మనుగడకు కావలసిన విధంగా ఉంటుంది. తాము గుర్తించిన కెప్లర్ 22-బి ఈ రకమైన పరిస్థితులలోనే ఉందంటున్నారు.
గత చరిత్ర
2011 మే నెలలో కూడా ఫ్రెంచి శాస్తవ్రేత్తలు భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో గ్లీజర్ 581 డి అనే గ్రహాన్ని గుర్తించారు. ఈ గ్రహం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికి ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
2011 ఆగస్టులో స్విట్జర్లాండ్ శాస్తవ్రేత్తలు హెచ్‌డి 85512 బి అనే గ్రహాన్ని గుర్తించారు. ఇదీ సూపర్ ఎర్త్ జాబితాలో ఉంది. భూమి కంటే పరిమాణంలో 3.6 రెట్లు ఎక్కువగా ఉంది.
2005లో యూజినో రివరా శాస్తవ్రేత్త గ్లీజ్ 876 డి అనే సూపర్ ఎర్త్‌ను గుర్తించారు. ఇది భూద్రవ్యరాశికి ఏడున్నర రెట్లు ఎక్కువ ఉంది. ఇది తన మాతృతార చుట్టూ మన కాలమానం ప్రకారం 2 రోజుల్లో తిరుగుతోంది. ఇటువంటి సూపర్ ఎర్త్‌లను ఇంతవరకు 16 గుర్తించారు.
మన సౌర కుటుంబం వెలుపలగల గ్రహాలలో ఇప్పటికి 500 గ్రహాలను ఖగోళ శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఈ నిరంతర అనే్వషణలో గ్రహాంతర వాసులు తారసపడితే అదొక అద్భుత పరిణామాలకు దారితీస్తుంది.

Thursday, January 3, 2013

అంగారకుడు గురించి కొన్ని విశేషాలుమనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కాని మనిషి కంటే తెలివైన జీవులు అరుణగ్రహం (అంగారకుడు)లో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై ఆనాడు కనిపించిన మానవ ముఖ రూపం నుంచి నిన్నా మొన్నటి గాంధీజీ ఆకృతి వరకు... కేవలం చిత్రాలు కావని... ఒకనాటి సంపన్న నాగరికతకు చెందిన సూచన ప్రాయమైన గుర్తులని అంటున్నారు. ఆ కథేమిటో తెలుసుకుందాం...
మన చిన్నప్పటి ఆకాశం పెద్ద కాన్వాస్. ప్రతి మేఘం చేయి తిరిగిన చిత్రకారుడి చిత్రమై మనల్ని గిలిగింతలు పెట్టేది. ఆకాశంలో నేను గుర్రాన్ని చూశానుఅని ఒకరంటే నేను ఏనుగును చూశానుఅని ఒకరు అనేవారు. మేఘాల్లో కనిపించే చిత్రవిచిత్రాలు అంగారక గ్రహంలోనూ ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. తేడా ఏమిటంటే... మేఘాలు మన ఆనందానికి, ఆశ్చర్యానికి  మాత్రమే పరిమితం. కానీ అంగారకగ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటికప్పుడు చర్చను రేకెత్తిస్తోంది.
సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇటలీ అంతరిక్ష సంస్థ అంగారకగ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. ఐరోపా మార్స్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో గాంధీజీ రూపం స్పష్టంగా ఉంది! అంగారకుడిపై చిత్రాల సందడి నిన్నటి మొన్నటి విషయం కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది.
1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )కు చెందిన వైకింగ్-1 స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమి మీదకు పంపింది. ఆ చిత్రాల్లో సైడోనియ అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటి పడింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.
మరికొందరు మాత్రం చాలా ఏళ్ల క్రితమే అంగారకుడిపై తెలివైన నాగరికత వర్థిల్లిందని దాని తాలూకు ఒకానొక ఆనవాలే మానవ ముఖరూపంఅని చెప్పారు. కొందరైతే రెండు మూడు అడుగులు ముందుకు వేసి అంగారకుడిపై ప్రాచీన నాగరికత తాలూకు అంశాలను దాచి పెట్టే కుట్రను నాసా చేస్తోంది’’ అని ఆరోపించారు.
ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమంటే, వైకింగ్ చిత్రాల కంటే ముందుగానే...1958 సెప్టెంబర్‌లో ది ఫేస్ ఆన్ మార్స్పేరుతో కామిక్‌బుక్ వచ్చింది. విలియమ్‌సన్ రాసిన ఈ పుస్తకానికి జాక్ కిర్బె బొమ్మలు గీశాడు. ఈ కథలో అంగారకుడిపై వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్షశాస్త్రవేత్తల బృందానికి అక్కడి కొండల్లో చెక్కిన మానవరూపం కనిపిస్తుంది! హైరిజుల్యుషన్ ఉన్న వైకింగ్ చిత్రాలు అందరికీ అందుబాటులో లేక పోవడంతో ఎవరి ఊహలకు అనుగుణంగా వారు వ్యాఖ్యానించుకునే పరిస్థితి ఏర్పడింది.
కొందరైతే అంగారక గ్రహంపై కనిపించిన మానవ ముఖంపై పుస్తకాలు రాసి హాట్ హాట్‌గా అమ్ముకున్నారు కూడా. అంగారకుడిపై మానవ ముఖంఅనే అంశం పుణ్యామా అని ఆరోజుల్లో మిగిలిన గ్రహాల కంటే అంగారకుడిపై ఆసక్తి పెరగడానికి కారణమైంది. అంగారకుడిపై హాలివుడ్‌లో సినిమాలు ప్రారంభమయ్యాయి. పత్రికల్లో, రేడియోల్లో వేడి వేడి చర్చ మొదలైంది.
స్పష్టాస్పష్టంగా కనిపించే రూపాలను ఆధారంగా చేసుకుని ఊహలు అల్లడం అనైతికంఅని హేతువాదులు వేడివేడిగా వాదనకు దిగే రోజుల్లో ఒక చిత్రం జరిగింది. అంగారకుడిపై ఏదో ఉందిఅని వాదించేవాళ్లకు అదొక అదృష్టంగా పరిణమించింది. 1998లో నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ స్పేస్‌క్రాఫ్ట్ అతి దగ్లర్లో నుంచి తీసిన అంగారకుడి చిత్రాలను భూమి మీదికి పంపింది. వైకింగ్ చిత్రాల కంటే ఇవి ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి. మానవ ముఖరూపం, కళ్లు, పెదాలు, ముక్కు... కొంత స్పష్టంగా గుర్తించడానికి వీలైంది.
మార్స్ ఆర్బిటర్ కెమెరా (ఎంఒసి) చిత్రించిన చిత్రాల ద్వారా అంగారకుడిపై మరి కొన్ని ఆకారాలను గుర్తించారు. ఒక చోట సీతాకోక చిలుక ఆకారం కనిపించింది. మరోచోట ఒక కొండ నత్త ఆకారం, దాన్నే మరో వైపు నుంచి చూస్తే కుక్క ఆకారం కనిపించింది. నవ్వుతున్న ముఖంతో కూడిన ఆకారం, ప్రేమగుర్తు కూడా ఎంఒసి చిత్రాల్లో కనిపించాయి. కొన్ని చిత్రాలలోని ఆకారాలు అంగారకుడిపై చెట్లు ఉన్నాయనే వాదనను లేవనెత్తాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టిపారేశారు. ‘‘అంగారకుడిపై ఏర్పడిన ధూళిమేఘాలు వివిధరూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయి తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు’’ అన్నారు వాళ్లు.
2007లో తీసిన ఒక ఫోటోలో ఒక వ్యక్తి మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆకారం కనిపించింది. దీని ఆధారంగా అంగాకుడిపై జీవులు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శంఅని వాదించిన వాళ్లు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అంగారుకుడిపై మిథేన్ వాయువు ఆనవాళ్లు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి ఆసక్తి మళ్లీ తాజాగా మొదలైంది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కోలిన్ (బ్రిటన్) అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీథేన్ వాయువు బలమైన నిదర్శనంఅని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఊష్ణోగ్రతకు, రాత్రి ఊష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవులు మనుగడకు అవకాశాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.
అంగారకుడిపై ఆశ్చర్యం గొలిపే ఆకారాలపై ఆసక్తి ఈనాటిది కాదు. 1784లో బ్రిటీష్ ఆస్ట్రానమర్ సర్ విలియమ్ హర్‌స్కెల్ అంగారకుడిపై చీకటిగా కనిపించే ప్రాంతాలు సముద్రాలు, చీకటి తక్కువగా ఉన్న ప్రాంతాలు భూభాగంఅని రాశారు. 1895లో పెర్సివల్ లొవెల్ అనే ఆస్ట్రానమర్ మార్స్అనే పేరుతో రాసిన పుస్తకంలో అంగారకుడిపై కాలువలు ఉన్న విషయాన్ని రాశాడు. అయితే ఆ తరువాత కాలంలో ఇది అవాస్తవంగా రుజువైంది. తక్కువ నాణ్యత ఉన్న టెలిస్కోప్‌ల కారణంగా ఆనాటి శాస్త్రవేత్తలు అంగారకుడిలోని ఆకారాలను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. దర్పణభ్రమకు గురయ్యారు.
‘‘అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్లే వాళ్లమే’’ అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు బీరకాయపీచు బంధుత్వం ఉండేది. ఆ తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది. ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్లొచ్చు. సీతకోక చిలకతో చెలిమి చేయవచ్చు. గాంధీతాతతో మాట్లాడవచ్చు! అక్కడ సుసంపన్నమైన నాగరిత వెలిగి ఉంటే ఆ వెలుగు జాడలు వెదికి చూడవచ్చు. వేచి చూద్దాం! - యాకూబ్ పాషా
ఆర్థర్ సి. క్లార్క్ రాసిన తొలి సైన్స్ ఫిక్షన్ నవల ది సాండ్స్ ఆఫ్ మార్స్’. 1951లో ప్రచురించబడిన ఈ నవల మంచి ఆదరణ పొందింది. మార్టిన్ గిబ్బన్ అనే సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత అంగారక యాత్ర చేస్తాడు. అంగారక గ్రహం ప్రధానాధికారిని కలుస్తాడు. ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అంగారకుడిపై కంగారులను పోలిన జీవులను చూస్తాడు. అక్కడ మొక్కలను పెంచుతారనే విషయాన్ని తెలుసుకుంటాడు...ఇలా అంగారకుడికి సంబంధించి చిత్రవిచిత్ర విషయాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. అంగారకుడిపై నీటి కాలువలు ఉన్నాయనే ఊహ ఆధారంగా క్లార్క్ ఈ నవల రచించాడు.


Thursday, December 27, 2012

అల్లరినరేష్ సినిమా చూస్తూ ప్రసవించిన మహిళ....

ఈ న్యూస్ నేను అల్లరి నరేష్ ట్విట్టర్ అకౌంట్లో  చూసాను. ఇటివల విడుదలై విజయం సాధించిన సుడిగాడు సినిమా చూస్తున్న మహిళ సినిమా హాల్లోనే బిడ్డకు జన్మని ఇచ్చింది. పూర్తి వివరాలు క్రింద వున్నాయి. 

Wednesday, December 26, 2012

కాకులకేందుకు అన్నం పెడతారు ?

మనకి దగ్గరగా వుండే పక్షి కాకి.కాకికి గతగతాలు తెలుసునని  శాస్రాలు  చెబుతున్నాయి .పోయిన జీవుడు కాకి రూపంలో అయిన  వాళ్ళ చుట్టూనే తిరుగుతాడని ,అన్నాన్ని పెట్టినపుడు అన్నాన్ని ముట్టుకుంటే వాని కోరికలు తిరినట్టు , ముట్టుకోకపోతే వారి కోరికలు తీరనట్టు శాస్రం చెబుతోంది.అలాగే కాకులరిస్తే చుట్టాలు వస్తారు అనే వారు, నిజంగానే వచ్చెవారు కుడా.

ఆహారం తీసుకొనెటప్పుదు తీసుకోవలిసిన జాగ్రత్తలు ....

భోజనానికి ముందు ఆమ్లగుణం గల దానిమ్మ తింటే అజీర్ణం భాద వుండదు.పుల్లని పెరుగు అస్సలు తినకూడదు .మినుమలతో చేసిన పదార్దాలు తిన్న తర్వాత పాలు త్రాగాకూడదు.తినే పదార్దాలను ఎక్కువ సార్లు వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు.ఇలా తినడం వల్ల గ్యాస్ పెరిగి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.తినే ఆహారాన్ని నిలబడి, కాళ్లుచాపి , నడుస్తూ, మాట్లాడుతూ అస్సలు తినకూడదు.

Monday, December 24, 2012

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?

హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ  ప్రవహించె చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో   చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా , అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.