Friday, January 4, 2013

సూపర్ ఎర్త్ గురించి తెలుసుకుందామా....



ఈ అనంత విశ్వంలో వేరెక్కడైనా జీవరాశి ఉందేమోనని తెలుసుకునేందుకు సైన్సు పరిశోధనా చరిత్రలోకెల్లా అతి విస్తృతానే్వషణ కార్యక్రమం జరుగుతోంది. అత్యాధునిక కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని నాసా’ (అమెరికా వ్యోమ, వైమానిక సంస్థ) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.
1960లో రష్యాలో ఎద్దు పుర్రె ఒకటి దొరికింది. దానిని ప్రయోగశాలలో విశే్లషించి చూస్తే ఆ ఎద్దు బతికి ఉండగా నాలుగు వేల సంవత్సరాల క్రితం కొట్టిన తుపాకీ గుండు వల్ల పుర్రెకు రంధ్రం పడినట్లు తెలుసుకున్నారు. అన్ని వేల సంవత్సరాల క్రితం తుపాకీ గుండు ఎక్కడిది?
అమెరికాలోని నవాడా రాష్ట్రంలో దొరికిన ఒక ఇనుప నట్టు కూడా అనేక మిలియన్ల సంవత్సరాలకు పూర్వం తయారు కాబడిందని కనుగొన్నారు. ఒకప్పుడు భూమి మీద గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పడానికి కావలసినన్ని తార్కాణాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ భూమిపై మానవుడు అవతరించడానికి ముందు అన్యగ్రహ వాసులు ఈ భూగ్రహానికి యాత్రలు చేస్తూ ఉండేవారని కొంతమంది బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ఈ గ్రహాంతర వాసుల ఉనికిని తెలియజేసే సంకేతాల కోసం మన శాస్తవ్రేత్తలు అహరహం శ్రమిస్తున్నారు.
గ్రహాంతర బుద్ధిజీవుల గురించి నేడు దేశదేశాలా తర్క వితర్కాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇంతవరకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల మీద గాని, వాటి ఉపగ్రహాల మీద గాని జీవరాశి జాడ వున్న ఆధారాలు ఏమీ లభించలేదు.



సూపర్ ఎర్త్
అంతరిక్షంలోని రహస్యాలను తొంగి చూసేందుకు అనేక అంతరిక్ష నౌకలతోపాటు, అంతరిక్ష టెలిస్కోప్‌లు అంతరిక్షంలో నిరంతరం అనే్వషణా కార్యక్రమంలో ఉన్నాయి.
సుదూర ప్రాంతాల్లో ఇతర నక్షత్రాల సమీపంలో జీవరాశి ఉండే అవకాశం గల గ్రహాల అనే్వషణా కార్యక్రమంలో భూమిని పోలిన సూపర్ ఎర్త్‌ను గుర్తించడం జరిగింది.
600 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న సూపర్ ఎర్త్‌ను నాసా తమ కెఫ్లర్ అంతరిక్ష దూరదర్శిని ద్వారా గుర్తించింది. ఇది ఆ నక్షత్రం చుట్టూ మన కాలమానం ప్రకారం 290 రోజులకు ఒకసారి తిరుగుతోంది. ఇది భూమి పరిమాణానికి 2.4 రెట్లు ఉంది. అందుకే దీనిని సూపర్ ఎర్త్అనే పేరుతో గుర్తిస్తున్న వాటి జాబితాలో చేర్చారు.
ఈ సూపర్ ఎర్త్ తలం జీవరాశికి నివాసయోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, దానికి ఉపరితలం ఉంటే జీవరాశి మనుగడకు కావలసిన ఉష్ణోగ్రత ఉంటుందని నాసా శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ గ్రహం ఉపరితలంపై నీరు ద్రవరూపంలో ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే దీని తలం ఘనరూపంలో ఉందా లేదా నెప్ట్యూన్ తలం మాదిరి వాయు రూపంలో ఉందా? అనే విషయంపై అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు నాసా శాస్తవ్రేత్తలు.
ఈ సూపర్ ఎర్త్‌ను కెప్లర్ 22-బి అని నామకరణం చేశారు. దీని ఉపరితలం మీద ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చునని భావిస్తున్నారు. సౌర కుటుంబం వెలుపల ఇంతవరకు గుర్తించిన గ్రహాల్లో ఇదే అనువైన వాతావరణం కల్గి ఉందని నాసా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
తమ అధ్యయనంలో ఈ సూపర్ ఎర్త్‌పై కొంత నేల మరి కొంత నీరు ఉందని తెలిసిందంటున్నారు. సాధారణంగా ఒక గ్రహంపై జీవరాశి ఉండాలంటే అది దాని మాతృతారకు నిర్దేశిత దూరంలో ఉండాలి. అప్పుడే దాని మీద ఉష్ణోగ్రత జీవరాశి మనుగడకు కావలసిన విధంగా ఉంటుంది. తాము గుర్తించిన కెప్లర్ 22-బి ఈ రకమైన పరిస్థితులలోనే ఉందంటున్నారు.
గత చరిత్ర
2011 మే నెలలో కూడా ఫ్రెంచి శాస్తవ్రేత్తలు భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో గ్లీజర్ 581 డి అనే గ్రహాన్ని గుర్తించారు. ఈ గ్రహం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికి ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
2011 ఆగస్టులో స్విట్జర్లాండ్ శాస్తవ్రేత్తలు హెచ్‌డి 85512 బి అనే గ్రహాన్ని గుర్తించారు. ఇదీ సూపర్ ఎర్త్ జాబితాలో ఉంది. భూమి కంటే పరిమాణంలో 3.6 రెట్లు ఎక్కువగా ఉంది.
2005లో యూజినో రివరా శాస్తవ్రేత్త గ్లీజ్ 876 డి అనే సూపర్ ఎర్త్‌ను గుర్తించారు. ఇది భూద్రవ్యరాశికి ఏడున్నర రెట్లు ఎక్కువ ఉంది. ఇది తన మాతృతార చుట్టూ మన కాలమానం ప్రకారం 2 రోజుల్లో తిరుగుతోంది. ఇటువంటి సూపర్ ఎర్త్‌లను ఇంతవరకు 16 గుర్తించారు.
మన సౌర కుటుంబం వెలుపలగల గ్రహాలలో ఇప్పటికి 500 గ్రహాలను ఖగోళ శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఈ నిరంతర అనే్వషణలో గ్రహాంతర వాసులు తారసపడితే అదొక అద్భుత పరిణామాలకు దారితీస్తుంది.

No comments:

Post a Comment