Saturday, November 17, 2012

రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు...



ఓ ఆసామికి గొడ్డులా కష్టపడటం తప్పితే మరేదీ పట్టేదికాదు. ఓసారి ఆ వూళ్లో ఎవరో రామాయణ కథాశ్రవణం ఏర్పాటు చేశారు. దాంతో కుటుంబ సభ్యులంతా పురాణకాలక్షేపానికి వస్తూ మనవాణ్ని కూడా తీసుకొచ్చారు. కథ మొదలయింది. చల్లటిగాలికి మనవాడికి నిద్రముంచుకొచ్చింది.

మంచి చోటు చూసుకుని హాయిగా నిద్రపోయాడు. మర్నాడూ, ఆ మర్నాడూ... రోజూ ఇదే తంతు. చివరి రోజున రాముడూ, సీతా అని ఎవరో అనడం వినిపించింది. వెంటనే మనవాడు పక్కనున్నాయన్ని ‘ఇంతకీ రాముడికి సీత ఏమవుతుందటా’ అని అడిగాడట ఆవులించుకుంటూ! ఇంకేముంది... అతడి నిర్వాకం కాస్తా నిమిషాలమీద సామెతగా మారిపోయింది. 

No comments:

Post a Comment