Tuesday, November 13, 2012

కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు?



బట్టలను మగ్గాలపై నేస్తారు. అలా నేసేముందు నూలుకు గంజి పెడతారు. ఆ గంజిని పిండితో చేస్తారు. దీనివల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరతాయి. ఆ వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. క్రిములను పసుపు చంపేస్తుంది. అందుకే పసుపు రాసిన తర్వాతే కొత్త దుస్తులు ధరించమని పెద్దలు చెబుతారు. అయితే ఫ్యాషన్ పెరిగేకొద్దీ ఈ అలవాటు మెల్లగా తగ్గిపోయింది. ఎవరో కొందరు మాత్రమే ఇప్పుడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

No comments:

Post a Comment