Wednesday, November 14, 2012

వినాయకునికి నమస్కరించాక..మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు?



బాలగణపతి ఓసారి ఎందుకో అలిగాడు. ఆ అలక మాన్పించడానికి పార్వతి పరిపరి విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో బ్రహ్మాది దేవతలను రప్పించింది పార్వతి. అందరూ తమకు తోచిన రీతిలో ప్రయత్నించారు. ఊహు! గణపతి అలక మానలేదు. ముఖంలో నవ్వు కనిపించలేదు. చివరికి ఇంద్రుడు తన తలమీద మొట్టుకున్నాడు.

సరిగ్గా అప్పుడే గణపతి ముఖంలో నవ్వు తొంగిచూసింది. అది చూసిన ఇంద్రుడు తక్కిన దేవతలతో కలిసి మళ్లీ మళ్లీ మొట్టికాయలు వేసుకున్నాడు. కొందరేమో గుంజిళ్లు తీయడం మొదలెట్టారు. అంతే! బాలగణపతి అలక మాయమై, పకపక నవ్వులు మొదలైనాయి. అప్పటినుంచీ గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు మొట్టికాయలు వేసుకోవడం మొదలైంది. అదే సంప్రదాయంగా స్థిరపడింది. 

No comments:

Post a Comment