గోపి అనే శబ్దం నుంచి ‘గొబ్బి’ అనే పదం పుట్టింది. మధ్యన ఉండే పెద్ద గొబ్బెమ్మ శ్రీకృష్ణునికి, చుట్టూ ఉండే చిన్న గొబ్బిళ్లు గోపికలకు ప్రతీక. పవిత్రమైన ఈ మాసంలో శ్రీకృష్ణుని, ఆయన ఇష్టసఖులను తలచుకోవడంలో భాగంగానే ఆవుపేడతో గొబ్బిళ్లు పెట్టి, వాటి మధ్యలో గుమ్మడి, బంతి, చేమంతి పూలు గుచ్చి, ఒకరి చేతులు ఒకరు పుచ్చుకుని, గొబ్బిపాటలు పాడుతూ నృత్యభంగిమలో వలయాకారంగా తిరుగుతారు. కొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యునికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకూ సంకేతమని చెబుతారు. రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను తీసుకు వచ్చి ఇంటి ముంగిట పెట్టినట్లేనని, అందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని ఇంకోలా కూడా పెద్దలు చెబుతారు.
No comments:
Post a Comment