Tuesday, November 13, 2012

దేవుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు?మనిషిలో ఉన్న అహంకారాన్ని దేవుడి దగ్గర వదిలివేయడానికి ప్రతీకగా చేసే చర్య కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. కొబ్బరికాయను కొడుతున్నామంటే, మన అహంకారాన్ని పూర్తిగా విడనాడి, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును పవిత్రంగా మార్చుకున్నామని, నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలను ఉంచుకుంటామని దేవుడికి విన్నవించుకుంటున్నట్టు అర్థం. 

No comments:

Post a Comment