Thursday, November 29, 2012

బాల్యం ఒక వరం అంటారు కదా ! మరి వృద్ధాప్యం వరమా లేక శాపమా ?


బాల్యం అనేది ఒక మదురమైన అనుభూతి. అందుకే దాన్ని దేవుడు ఇచ్చిన వరం అని అంటారు. అలానే వృద్ధాప్యం కూడా దేవుడు మనకి ఇచ్చిన  మరొక గొప్పవరం అని నా  అభిప్రాయం . ఎందుకంటే మనిషి మజిలిలో చివరి దశ వృద్ధాప్యం.తన జీవితమంతా కుటుంబం కష్టపడ్డ మనిషికి  ఈ సమయంలో తన  కొడుకులు, కోడళ్ళతో , మనుమలతో హాయిగా గడపాలి అని వుంటుంది. అంతకుమించి వాళ్ళు మన దగ్గర నుండి ఏమి ఆశించరు. కానీ మనం చేస్తున్నది ఏమిటి!రెక్కలువచ్చిన పక్షిగూడు నుంచి ఎగిరి పోయినట్టు మనసంపాదన చేతికి రాగానే వాళ్ళని వదిలి వేస్తున్నాము.  వృద్ధాశ్రమాల పేరుతో వారిని మన నుండి దూరం అందరుచేస్తున్నాము.అందరు ఇలానే చేస్తున్నారు అని నెను చెప్పడం లెదు. కానీ ఇలా చేస్తున్నవారు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. అందువల్లనే వృద్ధాశ్రమాల సంఖ్య  కూడా రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. మనల్ని కని , పెంచి,చదివించి మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసిన తల్లితండ్రుల్ని మన కళ్ళలో పెట్టుకొని చూసుకోవడం  మనకు  దేవుడు  ఇచ్చిన వరం అని నా అభిప్రాయం. మీరు ఏమంటారు ?

No comments:

Post a Comment