పూర్వం ఒక పిసినిగొట్టువాడు నువ్వులు పండించాడు. మామూలు వ్యక్తిని కాపలాగా పెడితే తినేస్తాడేమోనని చేతులు లేనివాడిని నియమించాడు. వాడి మీద కూడా అనుమానమొచ్చింది. ‘‘ఏరా నువ్వులు తింటున్నావా?’’ అనడిగాడు. ‘‘చేతుల్లేవు కదా, ఎలా తినగలను?’’ అన్నాడు వాడు.
‘మొండిచేతులకి నూనె పూసుకుని, వాటిని నువ్వులలో అద్ది తినొచ్చుగా!’’ అన్నాడు. నిజానికి వాడికా ఆలోచనే లేదు. కాని, యజమాని చెప్పింది విన్న తర్వాత చేతులకి నూనె రాసుకుని నువ్వులు తినడం మొదలెట్టాడు. ఇది ఊరందరికీ తెలిసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది.
No comments:
Post a Comment