.
ఎదుటివాళ్ల బాధను గురించి కొందరు అస్సలు పట్టించుకోరు. పైగా తమ అవసరాలకు లోటు కలిగిందని బాధపడి సాధిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సామెత వాడతారు. దీని వెనుక ఓ తమాషా కథ ఉంది.
ఒకసారి ఓ దొంగ ఏ ఇంటిలో కన్నం వేద్దామా అని అన్ని ఇళ్లూ పరిశీలిస్తూ ఊరంతా తిరిగాడు. చివరికి ఓ ఇంటిని ఎంచుకున్నాడు. రాత్రికి వచ్చి దోచుకెళ్దామని పథకం వేసుకున్నాడు. తీరా రాత్రి అతడు వచ్చేసరికి అగ్నిప్రమాదంలో ఆ ఇల్లు కాలిపోతూ ఉంది. ఇంట్లో వాళ్లంతా ఏడుస్తూ ఉంటే, వీడూ అక్కడ కూలబడి ఏడవడం మొదలెట్టాడు. అందరూ ఏమైందని అడిగితే, కష్టపడి దొంగతనానికి పథకం వేస్తే ఆ ఇల్లు కాలిపోతోందే అంటూ భోరుమన్నాడు. ఇల్లు కాలిందని వాళ్లేడుస్తుంటే, దొంగతనం వల్లకాలేదని నువ్వేడుస్తున్నావా అంటూ అందరూ నాలుగు తగిలించారు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది.
No comments:
Post a Comment