Monday, November 12, 2012

దేవుడికి కర్పూర హారతి ఎందుకిస్తారు?


దీనికి కారణం కర్పూరానికి ఉన్న విశిష్ట లక్షణాలే. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి దానితో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్పుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అంటువ్యాధుల్ని ప్రబలకుండా చేస్తుంది. ఇంకా ఇలాంటి ఉపయోగాలెన్నో ఉండటం వల్ల కర్పూరాన్ని వాడటం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment