మనం తింటున్న తిండి,తాగుతున్న నీరు , పీలుస్తున్న గాలి ఎంతవరకు స్వచమైనవి?ఈ ప్రశ్నకు సమాధానం 100 శాతం కలుషితమయినవి . ఒక్కప్పుడు ఒక ఎకరా పొలంలోరెండు పుట్ల వరి పండేది. అది ఎటువంటి క్రిమిసంహారక మందులను వాడకుండా కేవలం ఎరువు వేసి పండించేవారు.కాని ఇప్పుడు అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి క్రిమిసంహారక మందులను వాడడం వల్ల మనం తినే ఆహారం కలుషితం అయింది . పారిశ్రామీకరణ పేరుతో ఫ్యాక్టరీలను నిర్మించి వాటి నుండి వెలువడే వ్యర్దాలను శుద్దిచేయకుండా బయటకు విడుదల చెయ్యడం వల్ల పీల్చె గాలి కలుషితం అయ్యింది. అంతేకాకుండా పరిశ్రమల వ్యర్దాలను కాలువలలోకి, చెరువులలోకి మరియు సముద్రాల్లోకి వదలడం వల్ల భూగర్బ జలాలు కూడా కలుషితమవుతున్నాయి . అందుకే ఇంట్లో బావులు వున్నా కూడా త్రాగే నీరు కొనుక్కో వలసిన దుస్థితి వచ్చింది.
No comments:
Post a Comment