శఠారి గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్లిన భక్తులకు దేవతలను తాకేందుకు వీలుండదు కాబట్టి తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయపూజారి శఠారిని తీసుకొచ్చి భక్తుల తలకు తగిలించడం ఆచారంగా వస్తోంది. శఠులు అంటే మోసగాళ్లు అని అర్థం. అరి అంటే శత్రువు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలకు తాకించడం ద్వారా వారిలోని చెడు తలంపులు, ద్రోహబుద్ధులు నశించి సద్వర్తన అలవడుతుందనేది ఈ సంప్రదాయం వెనుక అంతరార్థం.
No comments:
Post a Comment