సంప్రదాయం ప్రకారం పూజలు, వ్రతాలు వగైరా అన్నింటిలోనూ భార్య, భర్తకు ఎడమవైపునే కూర్చోవాలని శాస్త్రం నిర్దేశిస్తోంది. అర్ధనారీశ్వరుడైన శివుడికి పార్వతి ఎడమభాగమైతే లక్ష్మీనారాయణులలో విష్ణువక్షస్థలంలో ఎడమవైపునే లక్ష్మి కొలువై ఉంటుంది.
అందుకే ఇప్పటికీ భర్తకు ఎడమవైపునే ఉండటం ఆచారంగా మారిందని సంప్రదాయవాదులంటే, హృదయం ఎడమవైపునే ఉంటుంది కాబట్టి భర్తకు హృదయేశ్వరి అయిన భార్య ఎడమవైపునే ఉంటుందని ఇంకొందరు కవిత్వీకరిస్తారు. అయితే పూర్వం ఆత్మరక్షణార్థం పురుషులందరూ ఆయుధాలు ధరించేవారు కాబట్టి కుడివైపున ఉండే ఆయుధాలు తగలకుండా పురుషునికి ఎడమవైపున కూర్చోవడం స్త్రీలకు అలవాటుగా మారిందని ఆధునికులంటారు.
No comments:
Post a Comment