Monday, December 3, 2012

చిరంజీవి గారి గురించి అందరికి తెలిసే వుంటుంది. కానీ ఈ మధ్య పేపర్ లో చిరంజీవి గారికి సంబందించిన ఈ అర్టికల్ కనిపించింది. ఇది మీ అందరితో పంచుకొవాలి అనిపించి ఇలా పోస్ట్ చేస్తున్నాను.

కుటుంబం

ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కధానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కధానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా సినిమా నిర్మాణం 2007లో "చిరుత"తో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై 170 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

తరువాత చిరంజీవి గారు రాజకియ్యాలోకి వచ్చిప్రజారాజ్యం పార్టి ఎర్పాటుచేసారు. చిరంజీవి తన పార్టీ పతాకాన్ని తిరుపతిలో ఆవిష్కరించటం జరిగింది. దీనిలో ప్రదానంగా మూడు రంగులు కలవు. పతాకంలో పై మూడో వంతు తెలుపు రంగు కలదు. క్రింద ఒకవంతు ఆకుపఛ్ఛ రంగు కలదు. ఈ రెంటిని కలుపుతూ మద్యలో ఎరుపు రంగులో సూర్యుడు వృత్తాకారంలో కలదు.ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ పార్టీ స్థాపనతో తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలకు గట్టిపోటీ వుంటుంది అందరు అనుకున్నారు.కానీ ఇప్పుడు ఈ పార్టి కాంగ్రెస్ లో విలీనం అయ్యింది.

చలనచిత్ర ప్రస్థానం

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కధ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా రుద్రవీణ, చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందాడు. గాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలఙయన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.

2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి.మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర,ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది.

ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, స్టాలిన్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలనా అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇంకా ఈ ఇమెజ్ వలన చిరంజీవి సున్నితమైన పాత్రలు పోషించిన సినిమాలకు తగినంత ప్రాధాన్యత రాలేదనిపిస్తుంది.

సేవా కార్యక్రమాలు

హైదరాబాద్‌లో చిరంజీవి రక్త, నేత్రనిధి ప్రధాన కార్యాలయంచిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

సత్కారాలు

 పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు
 పద్మభూషణ్ 2006 జనవరి,2006 లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి  పద్మభూషణ్ పురస్కారం స్వీకరణ.
 డాక్టరేట్  2006 నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు ఆంధ్ర యూనివెర్సిటీ తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ మరియు చాన్సుల్లర్ రామేశ్వర్ థాకూర్ నుండి.

రాజకీయ ప్రవేశం

చిరంజీవి ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 17 ఆగస్టు 2008 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 26 ఆగస్టు 2008 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానం లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది.తురువాత జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ అశించినంత పలితాలను పొందలేకపోయ్యింది .ఇప్పుడు ఈ పార్టి కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. అంతేకాకుండా చిరంజీవి గారికి కాంగ్రెస్ ప్రబుత్వం కేంద్ర టూరిజం శాక మంత్రిగా పదవిని కూడా ఇచ్చారు.ఎమైన చిరంజీవి గారి సిని ప్రస్తానం వున్నంత ఆశాజనికంగా వారి రాజకీయ జీవితం లేదనే చెప్పాలి.No comments:

Post a Comment