Monday, December 3, 2012

మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కొరత బాగా ఎక్కువగా వుంది. అస్సలు మన తెలుగు హీరోయిన్స్ కి ఏమైంది . ఒక్కప్పుడు అంటే 1960, 1970,1980 లో తెలుగు తెరను అంతా తెలుగు  హీరోయిన్సే ఏలారు. పాతతరం లో చెప్పాలంటే సావిత్రి, జమున, అంజలి దేవి ఇలా ఎంతోమంది గొప్ప నటీమణులు వున్నారు. కేవలం నటనలోనే కాదు అదంలో కూడా వాళ్ళకి వాళ్ళే సాటి. అలాగే 1980 లో వచ్చిన  విజయశాంతి, రాధ , రజని, రమ్యకృష్ణ , సౌందర్య,మీనా లాంటి వాళ్ళు కూడా వాళ్ళ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కానీ తరువాత నుండి తెలుగు తెర మీద పరబాష హీరోయిన్ల హవా మొదలు అయ్యింది. ఇప్పుడు తెలుగు తెర మీద స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న వారందరూ దాదాపు పరబాష వాళ్లె. కొంతమందికి తెలుగు మాట్లాడడం కూడా సరిగా రాదు. అలాఅని అస్సలు తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు లేరు అని నేను అనడం లేదు. కలర్స్ స్వాతి, బిందు మాధవి ఇలా  వున్న వాళ్ళని వేళ్ళమీద  లేక్కపెట్ట వచ్చు. కానీ వాళ్ళకు వస్తున్న అవకాశాలు కూడా అరకొరగా వున్నాయి.ఇది కేవలం మన తెలుగు సినిమాలకె పరిమితమయిన సమస్య కాదు. దాదాపు అన్ని బాష చిత్రాల్లొను ఇలాగే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది ? భూమి గుండ్రంగా వున్నట్టు మరలా ఎదో ఒకరోజు మన తెలుగు చిత్ర సీమ  తెలుగు హీరోయిన్స్ తో కళకళ లాడాలని కోరుకుందాము.

ఈ పోస్ట్ ఫై మీ అబిప్రాయాలను తెలుపగలరు.

No comments:

Post a Comment