Friday, November 30, 2012

ఇలా జరిగేతే ఎలా వుంటుంది !

నాకు అప్పుడప్పుడు ఇలా జరిగితే బలే తమాషాగా వుంటుంది కదా అనిపిస్తుంది. అది ఏంటంటే ఒకవేళ ఎవరినా దేవుడు  దిగివచ్చి నాకు  అదృశ్యం అయ్యే వరం ఇస్తే బాగుటుంది కదా అని. కాని ఈ వరం ఒక్కరోజు మాత్రమే వుండాలి. ఎందుకంటే ఎప్పటికి వుంటే మరలా దాని విలువ మనకి తెలిదు కదా అందుకు. నాకే గనక ఈ వరం వుంటే నేను అ వరమును ఇలా ఉపయొగించుకుంటాను.

1. నాకు ఎవరిమీదయిన కోపం వుంటే వెళ్లి వాళ్ళని నాలుగు దెబ్బలు వేసి వస్తాను.
2.ఒకవేళ అ రోజు పవన్ కళ్యాన్  సినిమా గనక రిలీజ్ అయివుంటే  హాయిగా అ  సినిమా చుస్తాను. అది కూడా టికెట్ లేకుండా.
3. సినిమా షూటింగ్ జరుగుతుంటే చుడాలి అని నాకు చిన్నప్పటినుండి బాగా ఇష్టం . అందుకే అది కూడా చుసెస్తాను.
4.బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి దొంగతనం చేసి అ డబ్బును పేదవాళ్ళకు పంచుతాను. మన తెలుగు సినిమాల్లో హీరో లాగ.

మరి మీకు కూడా ఇలాంటి వరం వస్తే దానిని ఎలా ఉపయొగించుకుంటారొ చెప్పండి.




అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా !

అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా ! దీనికి మన శాస్త్రాలు అవును అని సమాధానం చెప్తున్నాయి. అనామిక వేలు అంటే ఉంగరం వేలు అని అర్ధం. స్త్రీ , పురుషుల జీవనాడుల్లోని ఓ ముక్యమైన నాడి ఈ ఉంగరం వేలు వరకు వుంటుంది.అ నాడికి వత్తిడి  కావాలి.అందుకే ధనంతో సంబంధం లేకుండా బంగారం, వెండి,ఇత్తడి లేక రాగి ఎలా ఎదో ఒక ఉంగరాన్ని ఉంగరం వెలికి ధరించమని వట్టిగా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు.


Thursday, November 29, 2012

బాల్యం ఒక వరం అంటారు కదా ! మరి వృద్ధాప్యం వరమా లేక శాపమా ?


బాల్యం అనేది ఒక మదురమైన అనుభూతి. అందుకే దాన్ని దేవుడు ఇచ్చిన వరం అని అంటారు. అలానే వృద్ధాప్యం కూడా దేవుడు మనకి ఇచ్చిన  మరొక గొప్పవరం అని నా  అభిప్రాయం . ఎందుకంటే మనిషి మజిలిలో చివరి దశ వృద్ధాప్యం.తన జీవితమంతా కుటుంబం కష్టపడ్డ మనిషికి  ఈ సమయంలో తన  కొడుకులు, కోడళ్ళతో , మనుమలతో హాయిగా గడపాలి అని వుంటుంది. అంతకుమించి వాళ్ళు మన దగ్గర నుండి ఏమి ఆశించరు. కానీ మనం చేస్తున్నది ఏమిటి!రెక్కలువచ్చిన పక్షిగూడు నుంచి ఎగిరి పోయినట్టు మనసంపాదన చేతికి రాగానే వాళ్ళని వదిలి వేస్తున్నాము.  వృద్ధాశ్రమాల పేరుతో వారిని మన నుండి దూరం అందరుచేస్తున్నాము.అందరు ఇలానే చేస్తున్నారు అని నెను చెప్పడం లెదు. కానీ ఇలా చేస్తున్నవారు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. అందువల్లనే వృద్ధాశ్రమాల సంఖ్య  కూడా రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. మనల్ని కని , పెంచి,చదివించి మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసిన తల్లితండ్రుల్ని మన కళ్ళలో పెట్టుకొని చూసుకోవడం  మనకు  దేవుడు  ఇచ్చిన వరం అని నా అభిప్రాయం. మీరు ఏమంటారు ?

Tuesday, November 27, 2012

మనం తింటున్న తిండి,తాగుతున్న నీరు , పీలుస్తున్న గాలి ఎంతవరకు స్వచ్చమైనవి?

మనం తింటున్న తిండి,తాగుతున్న నీరు , పీలుస్తున్న గాలి ఎంతవరకు  స్వచమైనవి?ఈ ప్రశ్నకు సమాధానం 100  శాతం కలుషితమయినవి . ఒక్కప్పుడు ఒక ఎకరా పొలంలోరెండు పుట్ల వరి పండేది. అది ఎటువంటి క్రిమిసంహారక మందులను వాడకుండా కేవలం ఎరువు వేసి పండించేవారు.కాని ఇప్పుడు అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి క్రిమిసంహారక మందులను వాడడం వల్ల మనం తినే ఆహారం కలుషితం  అయింది . పారిశ్రామీకరణ పేరుతో ఫ్యాక్టరీలను నిర్మించి వాటి నుండి వెలువడే వ్యర్దాలను శుద్దిచేయకుండా బయటకు విడుదల  చెయ్యడం వల్ల పీల్చె గాలి కలుషితం అయ్యింది. అంతేకాకుండా పరిశ్రమల వ్యర్దాలను కాలువలలోకి, చెరువులలోకి మరియు సముద్రాల్లోకి వదలడం వల్ల భూగర్బ జలాలు కూడా కలుషితమవుతున్నాయి . అందుకే ఇంట్లో బావులు వున్నా కూడా త్రాగే నీరు కొనుక్కో వలసిన దుస్థితి వచ్చింది.

Monday, November 26, 2012

లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునేదీ దేనికి ?

కొంతమందికి లేవగానే కళ్లకు  చేతులు రుద్ది  అడ్డుకునే అలవాటు వుంటుంది. ఇలా చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పెవారు. కొంతమంది దినీని చాదస్తంగా కొట్టి పారేస్తారు.   కాని అందులో ఎంతో ఆరోగ్యం , ఉత్సాహం దాగి వుంది.  నిద్రలేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లొని ఉష్ణ శక్తీ కనులుద్వారా శరీరానికి 
వ్యాపించి మొత్తము శరీరానికి ఉత్తేజెం కలిగిస్తుంది.చేతులు రుద్దు కునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండా చుడటం ద్వార బ్రహ్మను పుజించినంత ఫలం కూడా దక్కుతుంది.


Sunday, November 25, 2012

ఇది కలియుగమా లేక ప్లాస్టిక్ యుగమా?

మనము ఎదుర్కుంటున్న సమస్యల్లో ముఖ్యమయినది ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య . 

ఆధునిక మానవుని జీవనంతో ముడిపడి ఉన్న వస్తువు ప్లాస్టిక్. పిల్లలు, పెద్దలు ప్లాస్టిక్ సంచుల వాడకానికి అలవాటుపడిపోయారు.పాలప్యాకెట్లు, తినుబండారాలు, కృత్రిమంగా తయారుచేసిన పొడులు, శీతలపానీయాలు, దేవుడికి హారతిచ్చే పవిత్రమైన కర్పూరం, పూజా సామగ్రి .. అన్నింటికీ ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నాం. వాడిన తర్వాత వాటిని వీధుల్లో పారేసి సమస్యలు సృష్టించుకుంటున్నాం. వీటి వాడకం ఎక్కవగా ఉండడానికి గల కారణం ఏదయినా వస్తువు కొన్నపుడు వాటితో పాటు ప్లాస్టిక్ కవర్ లను ఫ్రీగా ఇవ్వడమే.ప్లాస్టిక్ వస్తువులు కాలిస్తే డయాక్సిన్, ఫ్యూరాన్ అనే విషవాయువులు వాతావరణంలో ప్రవేశిస్తాయి.

భూమిలో పాతిపెట్టినా మట్టిలో కలవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. పశువులు తినేస్తే, వాటి పేగుల్లో అడ్డుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి.పల్చని ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి సంస్థల నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.కేవలం ప్రబుత్వమే  కాదు  మనలో కూడా  చైతన్యం రావాలి . తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధం అమలుచేసి ఆదర్శంగా నిలిచింది. ప్లాస్టిక్ వాడ కాన్ని నిషేధించడం ఎంతైనా అవసరం. 

సెల్లు సామెతలు


* ÍäAê„çÖ å®©Õx.. èä¦ÕÂ¹× *©Õx! 
* å®©ü©ð ²ñ©Õx.. G©Õx «ÍÃa¹ ’í©Õx! 
* ¤¶ò¯þ©ð X¾Â¹X¾Â¹-©Õ.. ¦ä©¯þq ÍŒÖ®Ï ¦ã¹¦ã¹-©Õ! 
* ƒ¯þ¹NÕ¢’û ƪáÅä ƒÂ¹ƒÂ¹-©Õ... »šü’îªá¢’û ƪáÅä ¹ÂÃ-N¹-©Õ! 
* ¦äœ¿ÂË J¸Âïà ©äŸ¿Õ ¹Êo¤Äp Æ¢˜ä ¦ÇxÂú¦ã“K ‡X¾Ûpœ¿Õ Âí¢šÇ«ÛªÃ ÍçÊo¤Äp ƯÃoœ¿¢{! 
* Æ©ÕxœËÂË ÆéªÂ¹ª½¢ ¹{o¢ ƒ²Äh¢ ÂÃF ‚éªo@ÁÙx 宩üG©Õx ¹{d©äÊÕ Æ¯Ão{d ‹ «Ö«Õ!