Showing posts with label ధర్మసందేహాలు. Show all posts
Showing posts with label ధర్మసందేహాలు. Show all posts

Wednesday, December 26, 2012

కాకులకేందుకు అన్నం పెడతారు ?

మనకి దగ్గరగా వుండే పక్షి కాకి.కాకికి గతగతాలు తెలుసునని  శాస్రాలు  చెబుతున్నాయి .పోయిన జీవుడు కాకి రూపంలో అయిన  వాళ్ళ చుట్టూనే తిరుగుతాడని ,అన్నాన్ని పెట్టినపుడు అన్నాన్ని ముట్టుకుంటే వాని కోరికలు తిరినట్టు , ముట్టుకోకపోతే వారి కోరికలు తీరనట్టు శాస్రం చెబుతోంది.అలాగే కాకులరిస్తే చుట్టాలు వస్తారు అనే వారు, నిజంగానే వచ్చెవారు కుడా.

Monday, December 24, 2012

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?

హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ  ప్రవహించె చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో   చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా , అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.

Sunday, December 23, 2012

గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు?

అందరు కాకపోయినా కొంతమంది పెళ్ళిలో పెళ్లికుతురిని గంపలో తీసుకొరావడం అనే పద్దతి పాటిస్తుంటారు .శ్రీమహాలక్ష్మి తామరపువ్వులో వుంటుంది.అందుకే మా ఇంటి మహాలక్ష్మిని గంప అనే తామరపువ్వులో తెచ్చి నీ కిస్తున్నాము అని బావం.

Saturday, December 22, 2012

పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా?

మనుషుల  శరీరంలో విధ్యుత్ దాగి వుంటుంది. అదే జీవశక్తి .వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం  తలపై పెడతారో వారిశక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహశక్తి జీవితాంతము పని చేస్తుంటుంది.అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం  పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది.సంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితో ముందు పెట్టిస్తారు.

Thursday, December 20, 2012

భోజనాన్ని ఎలా తినాలి ?

 ఎత్తయిన ప్రదేశంలో నోటికి దగ్గరగా కుర్చొని తినటం ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం పోతుంది. క్రొవ్వు పెరిగి ఆరోగ్యం పోతుంది.భారతీయ ఋషి సంప్రదాయం ప్రకారం కటిక నేలమీద కుర్చొకుండా చాప, పట్ట వంటింది వేసుకొని , ఇంటిల్లపాది గుండ్రగా కుర్చొని మధ్యలో ఆహార పదార్దాలు పెట్టుకొని భోజనం చేస్తె కనీసం యాబై శాతం వ్యాధులను 
అరికట్టవచ్చు .

ప్రొద్దున లేవగానే ఎవరి మోహం చూసావంటె...?

మనిషి శరీరం ఓ విధ్యుత్ కేంద్రం .రాత్రంతా నిద్రపోయి మెలకువ రాగానే కనులు  తెరిచినప్పుడు దేహంలోని  విధ్యుత్ శక్తి కనుల ద్వారా బయటికి వస్తుంది.మనకిఎదురయన మనిషిలో దేహ శక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మన మీద పడుతుంది.అదే వారి దేహ శక్తి తక్కువైతే మన ప్రభావం వారి మీద పడుతుంది.ఈ ప్రభావం వల్ల శరీరము ,మనస్సు అదుపు తప్పి చెయకూడని కార్యాలు చేసి ఉహించని సమస్యను తెచ్చుకుంటారు .అలా కాకుడదనే లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై  లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.

Friday, November 30, 2012

అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా !

అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా ! దీనికి మన శాస్త్రాలు అవును అని సమాధానం చెప్తున్నాయి. అనామిక వేలు అంటే ఉంగరం వేలు అని అర్ధం. స్త్రీ , పురుషుల జీవనాడుల్లోని ఓ ముక్యమైన నాడి ఈ ఉంగరం వేలు వరకు వుంటుంది.అ నాడికి వత్తిడి  కావాలి.అందుకే ధనంతో సంబంధం లేకుండా బంగారం, వెండి,ఇత్తడి లేక రాగి ఎలా ఎదో ఒక ఉంగరాన్ని ఉంగరం వెలికి ధరించమని వట్టిగా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు.


Monday, November 26, 2012

లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునేదీ దేనికి ?

కొంతమందికి లేవగానే కళ్లకు  చేతులు రుద్ది  అడ్డుకునే అలవాటు వుంటుంది. ఇలా చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పెవారు. కొంతమంది దినీని చాదస్తంగా కొట్టి పారేస్తారు.   కాని అందులో ఎంతో ఆరోగ్యం , ఉత్సాహం దాగి వుంది.  నిద్రలేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లొని ఉష్ణ శక్తీ కనులుద్వారా శరీరానికి 
వ్యాపించి మొత్తము శరీరానికి ఉత్తేజెం కలిగిస్తుంది.చేతులు రుద్దు కునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండా చుడటం ద్వార బ్రహ్మను పుజించినంత ఫలం కూడా దక్కుతుంది.


Friday, November 23, 2012

ప్రతి పూజకి అవుపాలే ఎందుకు వాడుతారు ?

 ఆవు సమస్త  సృష్టిలోకి పవిత్రమైనది .సకల దేవతలకి నివాస స్థలము . అందుకే పూజల్లో ,వ్రతాల్లో ,యజ్ఞాల్లో ఆవు పాలు ,పెరుగు, నెయ్యి వాడతారు.ఆవుపాలంటే సమస్త దేవతలను మన శుభకార్యానికి పిలిచినట్టె .అందుకే  వారి ఆహ్వానానికి చిహ్నమె ఆవుపాల వాడకము.

Wednesday, November 14, 2012

వినాయకునికి నమస్కరించాక..మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు?



బాలగణపతి ఓసారి ఎందుకో అలిగాడు. ఆ అలక మాన్పించడానికి పార్వతి పరిపరి విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో బ్రహ్మాది దేవతలను రప్పించింది పార్వతి. అందరూ తమకు తోచిన రీతిలో ప్రయత్నించారు. ఊహు! గణపతి అలక మానలేదు. ముఖంలో నవ్వు కనిపించలేదు. చివరికి ఇంద్రుడు తన తలమీద మొట్టుకున్నాడు.

సరిగ్గా అప్పుడే గణపతి ముఖంలో నవ్వు తొంగిచూసింది. అది చూసిన ఇంద్రుడు తక్కిన దేవతలతో కలిసి మళ్లీ మళ్లీ మొట్టికాయలు వేసుకున్నాడు. కొందరేమో గుంజిళ్లు తీయడం మొదలెట్టారు. అంతే! బాలగణపతి అలక మాయమై, పకపక నవ్వులు మొదలైనాయి. అప్పటినుంచీ గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు మొట్టికాయలు వేసుకోవడం మొదలైంది. అదే సంప్రదాయంగా స్థిరపడింది. 

Tuesday, November 13, 2012

శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?





సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే.  శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది  భామలతో  శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు.  అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి 


పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే  శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది. 

చెవులెందుకు కుట్టిస్తారు?



ఆడ పిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీ దేవిలా తలచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా వుంది.చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది.

సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?




ఏ  శుభకార్యములో  లేని  విధంగా  సీమంతం  సమయములో  గర్భినికి  అందరు  గాజులు  తొడుగుతారు .  ఐదోతనంతో   పాటు  పండంటి  బిడ్డను  కనాలని  ఆశిర్వాదిస్తారు . అలా  గాజులు  తొడిగే  కార్యములో  చక్కని  పరమార్థం  దాగుంది . గర్భం  ధరించిన  స్రీ  గర్భకోశం  మీద  కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.


 అందుకే ఏడో నెలలో   శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత  గాజులు  తొడుగుతారు .  చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై  సరియైన   ఒత్తిడి వచ్చి  సుఖప్రసవం జరుగుతుంది.

కంటి వ్యాదులున్న వారు వెండి కంచంలో ఆహరం తినటం మంచిదంటారు. నిజమా?




ఆర్థికంగా అవకాశం లేకపోయినా కనీసం వివాహమైన తరువాత  నుంచి లేదా వయసు దాటాక వెండి కంచంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల  నేత్రాలకు చలువ  చేస్తుంది. జఠరాగ్ని  పెరుగుతుంది.


 అన్ని వైద్య శాస్రాలు వెండిని కంటికి సంబంధించిన మందుల  తయారీలో వాడతారు.  వెండి కంటికి , ఒంటికి , పంటికి ఎంతో మేలు చేస్తుంది.

యమపురి దారి ఎలా ఉంటుంది?



మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళతారు. దారి అంత ఎగుడుదిగుడులు.  ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బ లెత్తినా  యమభటులు కొరడాలతో  కొట్టి నడిపిస్తారు. కనుచూపులోనే   నీరుంటుంది.  త్రాగబోతే చేతికి అందదు  .  మేహమేఘాలు  నిరంతరం  వర్షిస్తుంటాయి. అయితే అవి వర్షించేది నీరు కాదు రక్తాన్ని.  అలా పదిహేడు రోజుల పాటు జీవించినపుడు  చేసిన పాపాలను తలచుకొని వాపోతుంటాడు జీవుడు . ఆ తరువాతే యమపురి మజిలీ  అయిన   సౌమ్యపురం చేరతాడు.

భార్య భర్తలలో పురుషునికి పెద్ద వయసు ఉండాలంటారు ఎందుకు?





మన ఋషులు మన భద్రతకు, ఒక్కొక్క విషయాన్ని అనుభవ పూర్వకముగా గుర్తించారు.  సామాజిక కారణాలవల్ల స్త్రీలకు సిగ్గు బిడియము ఎక్కువ, అందువలన సంసారిక భాద్యతలలో కష్టించి పోషించాల్సిన భాద్యత మగవాడిదే.  ఆర్ధిక స్థితి గతులన్ని పురుషుడే చూసుకోవాలి.  గృహభాద్యతలు, సంతానాన్ని సక్రమంగా పెంచటం, పురుషుడు కష్టించి తెచ్చిన ధన దాన్యాడులను సక్రమముగా వినియోగించటం, పొదుపుగా కాపురం కొనసాగించటం మాత్రమె స్త్రీ కర్తవ్యం.


ఆషాఢమాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఎందుకు ఉంచుతారు?




ఆషాఢమాసం పొలం పనులకు ఎంతో అనుకూలమైన కాలం. కొత్తగా పెళ్లయిన పురుషులు ఎక్కువసేపు తమ భార్యలతో గడపాలన్న ఆశతో పొలం పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని, అదే జరిగితే పంట నాశనమవుతుందని, అందుకే వారిని భార్యలకు దూరంగా ఉంచితే, నెల ముగిసేసరికి పనులు పూర్తయిపోతాయనే ఉద్దేశంతో ఆషాఢంలో కొత్త దంపతులు కలవకూడదనే నియమాన్ని పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి.

గర్భిణీ స్త్రీలు గ్రహణం ఎందుకు చూడకూడదు?


గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.

కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు?



బట్టలను మగ్గాలపై నేస్తారు. అలా నేసేముందు నూలుకు గంజి పెడతారు. ఆ గంజిని పిండితో చేస్తారు. దీనివల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరతాయి. ఆ వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. క్రిములను పసుపు చంపేస్తుంది. అందుకే పసుపు రాసిన తర్వాతే కొత్త దుస్తులు ధరించమని పెద్దలు చెబుతారు. అయితే ఫ్యాషన్ పెరిగేకొద్దీ ఈ అలవాటు మెల్లగా తగ్గిపోయింది. ఎవరో కొందరు మాత్రమే ఇప్పుడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

ఉత్తరంవైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?



మన భూమిలో అయస్కాంతశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనం అటువైపు తలపెట్టి నిద్రపోయామంటే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు, మన మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక, రక్తప్రసరణలో మార్పు వస్తుంది. అంతేకాదు, దక్షిణ దిశలో యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అయితే, తమిళులు మాత్రం దక్షిణ దిక్కు చాలా శుభసూచకమని నమ్ముతారు.