Monday, December 24, 2012

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?

హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ  ప్రవహించె చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో   చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా , అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.

Sunday, December 23, 2012

గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు?

అందరు కాకపోయినా కొంతమంది పెళ్ళిలో పెళ్లికుతురిని గంపలో తీసుకొరావడం అనే పద్దతి పాటిస్తుంటారు .శ్రీమహాలక్ష్మి తామరపువ్వులో వుంటుంది.అందుకే మా ఇంటి మహాలక్ష్మిని గంప అనే తామరపువ్వులో తెచ్చి నీ కిస్తున్నాము అని బావం.

Saturday, December 22, 2012

చీమ గురించి తెలుసుకుందామా .....


చీమ గురించి తెలుసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా . అలా  అయెతే ఒకసారి ఈ క్రింది అర్టికల్ చదవండి. 

చీమ ఒక చిన్న కీటకము. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి.ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో ఇటీవల కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది.

మానవులకు మల్లే చీమలకు ఊపిరితిత్తులు, గుండె ఉండవు. రక్తానికి రంగు కుడా ఉండదు. అయినా, తమ కన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువు మోయడంతో సమానం మరి. శరీరం పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి. ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు.

పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వాసలు కురిసినా పడిపోకుండాఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో పుల్లలను కలిపేస్తాయి. లోపల చాలా అరలు ఉంటాయి. ఒక్కో అవసరానికి ఒక్కో అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే.. మరికొన్నింటిలో పిల్లల పెంపకం. ఇంకొన్ని గదుల విశ్రాంతి కోసం. అయితే, అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మరచిపోవు. కొన్నిరకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్ళను ఏర్పాటుచేసుకుంటాయి కూడా.

కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణి కి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి.

చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ' పెరోమోన్స్ ' ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి. వెంటనే అది ' ఫెరోమోన్ 'ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయంటే ... దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చీమలకు రెండు పొట్టలు వుంటాయంట . ఒక పొట్టలో తనకి కావలసిన ఆహారాన్ని, మరొక పొట్టలో మిగతా  చీమల కోసం ఆహారాన్ని తీసుకుపొతాయంట . ఇది చాలా గొప్ప విషయం కదండి. 


పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా?

మనుషుల  శరీరంలో విధ్యుత్ దాగి వుంటుంది. అదే జీవశక్తి .వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం  తలపై పెడతారో వారిశక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహశక్తి జీవితాంతము పని చేస్తుంటుంది.అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం  పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది.సంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితో ముందు పెట్టిస్తారు.

Thursday, December 20, 2012

భోజనాన్ని ఎలా తినాలి ?

 ఎత్తయిన ప్రదేశంలో నోటికి దగ్గరగా కుర్చొని తినటం ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం పోతుంది. క్రొవ్వు పెరిగి ఆరోగ్యం పోతుంది.భారతీయ ఋషి సంప్రదాయం ప్రకారం కటిక నేలమీద కుర్చొకుండా చాప, పట్ట వంటింది వేసుకొని , ఇంటిల్లపాది గుండ్రగా కుర్చొని మధ్యలో ఆహార పదార్దాలు పెట్టుకొని భోజనం చేస్తె కనీసం యాబై శాతం వ్యాధులను 
అరికట్టవచ్చు .

ప్రొద్దున లేవగానే ఎవరి మోహం చూసావంటె...?

మనిషి శరీరం ఓ విధ్యుత్ కేంద్రం .రాత్రంతా నిద్రపోయి మెలకువ రాగానే కనులు  తెరిచినప్పుడు దేహంలోని  విధ్యుత్ శక్తి కనుల ద్వారా బయటికి వస్తుంది.మనకిఎదురయన మనిషిలో దేహ శక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మన మీద పడుతుంది.అదే వారి దేహ శక్తి తక్కువైతే మన ప్రభావం వారి మీద పడుతుంది.ఈ ప్రభావం వల్ల శరీరము ,మనస్సు అదుపు తప్పి చెయకూడని కార్యాలు చేసి ఉహించని సమస్యను తెచ్చుకుంటారు .అలా కాకుడదనే లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై  లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.

Thursday, December 13, 2012

జగదీశ్ చంద్ర బోస్























జగదీశ్ చంద్ర బోస్ :
జననం  -   నవంబర్ 30 1858(1858-11-30) మైమెన్‌సింగ్, తూర్పు బెంగాల్ (ప్రస్తుతము బంగ్లాదేశ్), బ్రిటీష్ ఇండియా.
మరణం  -   నవంబర్ 23 1937 (వయసు: 78) గిరిడీ, బెంగాల్ ప్రావిన్స్, అవిభాజ్య భారతదేశం
నివాసం  -   అవిభాజ్య భారతదేశం
జాతీయత   -  భారతీయుడు
రంగము -    భౌతిక శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, బెంగాలీ సాహిత్యం, బంగ్లా సైన్సు ఫిక్షన్
సంస్థ  -   ప్రెసిడెన్సీ కళాశాల
మాతృ సంస్థ -    కలకత్తా విశ్వవిద్యాలయం.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం,లండన్ విశ్వవిద్యాలయం
ప్రాముఖ్యత   -  మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్
మతం   -  హిందూ

సర్ జగదీష్ చంద్ర బోస్, (నవంబర్ 30, 1858 – నవంబర్ 23, 1937) బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

 జీవితం
ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సు లో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా
 తన పరిశోధనను కొనసాగించాడు.

 పరిశోధనలు
ఈయన వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశాడు.

 ఆవిష్కరణలు
తరువాత వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు.ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.